ఎవ్వ‌రినీ లెక్క‌చెయ్యొద్దు.. సీఎం జ‌గ‌న్ ఆదేశాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే అన్నింటిలో నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబడి వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పిన జ‌గ‌న్.. తాజాగా మ‌రిన్ని విష‌యాల్లో జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎం అంటేనే త‌మ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివ‌ర‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రేమి చెప్పినా వినాలని అధికారుల‌కు ఆదేశాలు ఇస్తూ ఉండ‌టం మ‌నం చూశాం. కానీ వై.ఎస్ జ‌గ‌న్ మాత్రం ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఆయ‌న అధికారం చేప‌ట్టిన కొత్త‌లో కూడా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మావేశం నిర్వ‌హించి మీ బాద్య‌త‌లు మీరు ఫ్రీగా ఎలాంటి భ‌యం లేకుండా నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు.

అవినీతి అక్ర‌మాలు లేకుండా నిజాయితీగా ప‌ని చేయాల‌ని సూచించారు. ఇందుకోసం ఎవ‌రి నుంచి రెక‌మెండేష‌న్ వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పారు. త‌మ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా క‌రెక్టుగా ఉంటేనే చెయ్యాల‌ని లేదంటే ఆ ప‌నులు చెయ్య‌వ‌ద్ద‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలంతా స్వేఛ్చ‌గా ప‌నిచేసుకుంటూ పోతున్నారు. తాజాగా జ‌గ‌న్ అధికారుల‌కు మ‌రిన్ని ఆదేశాలు ఇచ్చార‌ని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇసుక‌, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాపై మ‌రోసారి ఆదేశాలు ఇచ్చారు. ఇప్ప‌టికే అధికారులంతా బాగా ప‌ని చేస్తున్నార‌న్న సీఎం.. ఇది ఇలాగే కొన‌సాగించాల‌ని చెప్పారంట‌. మ‌ద్యం, ఇసుక ర‌వాణాపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుండాల‌ని అన్నారు. అలాగే పోలీసులు కూడా బాగా ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న అభినందించారు. సీఎం స్థాయిలోని వ్య‌క్తి ఇలా నిజాయితీగా ఉండాల‌ని ఆదేశాలివ్వ‌డంతో అధికారులు కూడా పాజిటివ్ రెస్పాన్స్‌తో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here