క‌రోనా వ్యాక్సిన్లు ప‌ని చేయ‌వా..?

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ గురించే ఆలోచిస్తుంది. ఇందుకు త‌గ్గట్టుగానే ప‌లు దేశాలు వ్యాక్సిన్ త‌యారీపై దృష్టి పెట్టాయి. కీల‌క ద‌శ‌ల ప్ర‌యోగాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు త‌యారు చేస్తున్న వ్యాక్సిన్లు పనిచేయ‌వ‌ని ప‌లువురు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్ర‌త్యేక కార్య‌ద‌ళం చైర్మ‌న్ కేట్ బింగమ్ చెబుతున్న మాట‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్పుడు త‌యారుచేస్తున్న అన్ని వ్యాక్సిన్లు విఫ‌ల‌మ‌వుతాయ‌ని ఆయ‌న అంటున్నారు.ఈ మేర‌కు తాము గుర్తించిన‌ట్లు బింగ‌మ్ ఓ క‌థ‌నంలో వివ‌రాలు పొందుప‌రిచారు. క‌రోనాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుందో లేదో తెలియ‌ద‌న్నారు. అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు, వ్యాధి తీవ్ర‌త‌ను ఇప్ప‌టి వ్యాక్సిన్లు త‌గ్గిస్తాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచంలో ఇప్పుడు క‌రోనా విజృంభిస్తోంది. అయితే వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఆగితే చాల‌ని అంతా అనుకుంటున్నారు. వ్యాక్సిన్ వ‌స్తే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలా పంపిణీ చేయాల‌న్న దానిపై కీల‌క దేశాలు చ‌ర్చ‌లు జ‌రుపుతూ ప్ర‌ణాళికలు వేస్తున్నాయి. ప‌లు దేశాలు త‌యారుచేస్తున్న వ్యాక్సిన్లు కీల‌క ద‌శ‌లో ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ్యాక్సిన్ వ‌చ్చినా పూర్తి స్థాయి ఉప‌యోగం ఉండ‌ద‌ని కేట్ బింగ‌మ్ చెబుతున్న మాట‌లు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌ముఖుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. అయితే క‌రోనా మ‌ర‌ణాల్లో ఎక్కువ‌గా 65 ఏళ్లుపై బ‌డిన వారిలోనే ఉన్నందువ‌ల్ల వారికి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు తాము వ్యాక్సిన్ త‌యారీపై దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here