దేవినేని ఇకలేరు.. టీడీపీకి బిగ్ లాస్

టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరు.. విజయవాడలో పార్టీకి మూలస్తంభంగా ఉన్న మాజీ మంత్రి.. దేవినేని నెహ్రూ.. అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడిన ఆయన.. హైదరబాద్ లోని ఓ హాస్పిటల్ లో ఇవాళ ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో.. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదానికి గురయ్యారు.

ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ.. ఎన్టీఆర్ హయాంలో.. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. టీడీపీ చీలిపోయినపుడు ఎన్టీఆర్ కు అండగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. చివరికి చంద్రబాబు దగ్గరికి చేరుకున్నారు.

త్వరలోనే.. టీడీపీలో మళ్లీ ఉన్నత స్థాయికి చేరుకుంటారని దేవినేని నెహ్రూ అభిమానులు ఇన్నాళ్లూ ఆశించారు. ఆయన వెంటే నడిచారు. ఇప్పుడు ఆయన హఠాన్మరణం పొందడం.. అభిమానులనే కాదు.. కుటుంబసభ్యులతో పాటు.. విజయవాడ ప్రజలను కూడా విషాదానికి గురి చేస్తోంది.

దేవినేని ఆత్మకు శాంతి కలగాలని అంతా ప్రార్థిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here