అంతా పోలీసులే చేశారంటున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి..

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పోలీసులు ఏం చేశారో చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కూడా రైతులు ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నారు. కాగా నేటి భార‌త్ బంద్ విజ‌య‌వంతం అయ్యింది.

ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే చాలా సమయం తర్వాత ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. కేజ్రీవాల్ గృహ నిర్బంధంపై ఆప్ తీవ్ర స్థాయిలో మండిపడింది. రైతుల్ని కేజ్రీవాల్‌ను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా ఆప్ కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు

తాను ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులు తన ప్లాన్ తెలిసిపోయి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అడుగు బయట పెట్టకుండా అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here