జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే దాస‌రి చివ‌రి కోరిక

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దాస‌రినారాయ‌ణ రావు, వైఎస్ జ‌గ‌న్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది.
2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి కావాల‌ని దాస‌రి ఆశీర్వ‌దించార‌ట‌. అంతేకాదు 2017 వైసీపీ లో చేరి జ‌గ‌న్ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొంటాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే కొద్ది రోజుల‌త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్ట‌ముట్ట‌డంతో ఆస్ప‌త్రిపాలైయ్యారు. ఇదే దాస‌రి చివ‌రి కోరిక అని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

పార్టీ అధినేత‌గా ఉన్న జ‌గ‌న్ రెండుసార్లు దాస‌రినారాయ‌ణ‌రావుతో భేటీ అయ్యార‌ని ఇన్న‌ర్ టాక్. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి స్వ‌యంగా చెప్పారు.  అంతేకాదు సాక్షికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వైఎస్ జగన్ ప‌నితీరు అద్భుత‌మ‌ని దాస‌రి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దాస‌రి .., జ‌గ‌న్ భేటీల సంద‌ర్భంలో జ‌గ‌న్  ఏపీకి ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని ప‌లుమార్లు భేటీ అయిన సంద‌ర్భంగా అన్నార‌ట‌. ఈ వ్యాఖ్య‌ల్ని కొంద‌రు ఖండించిన దాసరి మాటంటే మాటే..జ‌గ‌న్ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే ఉంటార‌ని మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here