క‌రోనా ప‌రీక్ష‌ల్లో కొత్త విధానం.. లాలాజ‌లం ద్వారా టెస్టింగ్‌..

ప్ర‌పంచంలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతూనే ఉంది. దీంతో శాస్త్ర‌వేత్త‌లు కొత్త త‌ర‌హా విదానాలు తీసుకొస్తున్నారు. ప్ర‌ధానంగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాను గుర్తించేందుకు స్వాబ్ టెస్టులు చేస్తుండ‌గా.. ఇక కొత్త ప‌ద్ద‌తుల్లో ప‌రీక్ష‌లు చేయాల‌ని చూస్తున్నారు.

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 85,362 కొత్త కేసులు వ‌చ్చాయి. అంటే మొత్తం 13,41,535 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ కొత్త కేసుల‌తో ఇండియాలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. క‌రోనా తగ్గుముఖం ప‌ట్టింద‌నుకుంటున్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే. కొత్త‌గా 1,089 మంది మృత్యువాత ప‌డ్డారు. రిక‌వ‌రీ రేటు ప్ర‌పంచంలోనే భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉంది. కానీ కేసుల తీవ్ర‌త మాత్రం త‌గ్గ‌డం లేదు.

ఇక కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ గురించే ఆలోచిస్తూ ఉండ‌కుండా టెస్టింగ్ సామ‌ర్థ్యంపై శాస్త్ర‌వేత్త‌లు దృష్టి పెట్టారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నా ఫ‌లితం తొంద‌ర‌గా రావ‌డం లేదు. దీనివ‌ల్ల వైర‌స్ ఎక్కువ‌గా వ్యాపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వేగంగా ప‌రీక్ష‌లు చేసి వైర‌స్‌ను క‌నుక్కోవ‌డ‌మే మార్గ‌మ‌ని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పుడు చేస్తున్న స్వాబ్ టెస్టులు మాత్ర‌మే కాకుండా లాలాజలం ద్వారా టెస్టు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌. ఇప్ప‌టికే ఆస్గ్రేలియాలో ఈ త‌ర‌హాల లాలాజ‌ల టెస్టులు ప్రారంభించారు. క‌రోనా తీవ్ర‌త అత్య‌ధికంగా ఉన్న ప్రాంతాల్లో దీన్ని ప్ర‌యోగిస్తున్నారు.

లాలాజ‌లం ద్వారా చేసే ప‌రీక్ష‌ల్లో మూడు విధానాలు ఫాలో అవుతున్నారు. ఇందులో ఒక‌టి నోటి నుంచి నేరుగా లాలాజ‌లాన్ని ప‌రీక్ష చేసేందుకు తీసుకోవడం, రెండోది స్వాబ్ ద్వారా నాలుక కింది నుంచి న‌మూనాను తీసుకోవ‌డ‌డం, మూడోది నోటి నుంచి స్ట్రాలోకి తీసుకొని అక్క‌డి నుంచి టెస్టింగ్ ట్యూబ్‌లోకి తీసుకోవ‌డం చేస్తున్నారు. వైర‌స్‌ను తొంద‌ర‌గా క‌నిపెట్టేందుకు ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న అభిప్రాయం శాస్త్ర‌వేత్త‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here