క‌రోనా వైర‌స్‌ను చైనా త‌యారుచేసింది.. నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను చైనా త‌యారుచేసింద‌ని ఎప్ప‌టినుంచో ప‌లు పుకార్లు వినిపిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆ దేశానికి చెందిన వైరాల‌జిస్ట్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. చైనా క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన నిజానిజాలు బ‌య‌ట‌పెట్టింద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో త‌యారైన‌ట్లు తాను గుర్తించిన‌ట్లు వైరాల‌జిస్ట్ లి మెగ్ యాన్ తెలిపారు. అయితే ఆ ల్యాబ్ పూర్తిగా చైనా ప్ర‌భుత్వం కంట్రోల్‌లోనే ఉంటుంద‌న్నారు. ఈ వైర‌స్ ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లంద‌రూ భ‌య‌పడుతున్నార‌ని అయితే ఇది చైనా లోని ల్యాబ్‌లోనే త‌యారైంద‌న‌డానికి త‌న ద‌గ్గ‌ర ఆధారాలున్నాయ‌ని యాన్ అన్నారు. అయితే దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, చైనా తాను చెప్పినా విన‌లేద‌ని వెల్ల‌డించారు.

క‌రోనా వైర‌స్‌పై తాను మాట్లాడ‌కుండా అక్క‌డి అధికారులు బెదిరించార‌ని అందుకే అక్క‌డ ఉండ‌కుండా అమెరికా వెళ్లిపోయాన‌న్నారు. తాను చెప్పాల‌నుకున్న‌దంతా ఓ కార్య‌క్ర‌మంలో చెప్పారు. ఈ నెల 11వ తేదీన ఓ షోలో పాల్గొన్న ఆమె ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యాలు చైనా ప్ర‌భుత్వానికి ముందే తెలుస‌ని ఆమె చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here