క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుంది వీళ్ల నుంచే.. బ‌య‌ట‌ప‌డ్డ నివేదిక‌లు

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా యువ‌త నుంచే అంద‌రికీ వ్యాపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. యువ‌కుల్లో రోగ‌నిరోద‌క శక్తి ఎక్కువ‌గా ఉండ‌టంతో వైర‌స్ త‌మ‌ను ఏమీ చెయ్య‌ద‌న్న ధీమాతో విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దీంతో వైర‌స్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంది.

ఇటీవ‌ల వెల్ల‌డైన ప‌లు నివేధిక‌ల్లో క‌రోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో తెలిసింది. ఇందులో యువ‌త‌పై క‌రోనా ప్రభావం చాలా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే అన్‌లాక్ ఉన్న‌ప్ప‌టి నుంచి యువ‌త ప‌నుల నిమిత్తం, ప‌నిలేని వాళ్లు కూడా బ‌య‌ట తిరుగుతుండ‌టంతో క‌రోనా సోకింద‌ని తెలుస్తోంది. అయితే వీరిలో ఎటువంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించ‌డం లేదు.

అయితే వీరి నుంచి వీళ్ల కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకుతోంది. దీంతో వీరు క‌రోనాతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వారిలో 22.40 శాతం మందికి క‌రోనా సోకింద‌ట‌. 31 నుంచి 40 ఏళ్ల వారిలో 21 శాతం క‌రోనా సోకిన‌ట్లు తెల‌స్తోంది. వీళ్లు నిర్ల‌క్ష్యంగా ఉండ‌టంతో వీరి కుటుంబ సభ్యుల‌కు వైర‌స్ సోకుతోంది. దీంతో వైద్యులు తీవ్ర స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. త‌మ‌కు ఏమీ కాద‌ని బ‌య‌ట తిర‌గ‌డం మంచిది కాద‌ని బ‌య‌ట‌కు వెళ్లేట‌పుడు క‌చ్చితంగా మాస్క్ ధ‌రిస్తూ, భౌతిక దూరం పాటించాల‌ని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here