మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా.. రెండు రోజుల క్రితం నాగార్జున‌తో క‌లిసి సీఎం కేసీఆర్‌ను క‌లిసిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చిరు ఏమ‌న్నారంటే.. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం హీరో నాగార్జున‌తో క‌లిసి చిరు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. దీంతో నాగార్జున కుటుంబ స‌భ్యులు కూడా అప్ర‌మ‌త్త‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే చిరుకు ఎలాంటి ల‌క్షణాలు లేక‌పోవ‌డం ఇక్క‌డ సంతోషించ‌ద‌గ్గ విష‌యం. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న హోం క్వారంటైన్ అయ్యారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ టెస్టు చేయిచుకునేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి క‌రోనా గురించి ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అన్ని విధాలా కృషి చేసిన మెగాస్టార్ చివ‌ర‌కు క‌రోనా బారిన ప‌డ‌టం ఆయ‌న అభిమానులను షాక్‌కు గురిచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here