ఏపీలో ప్ర‌ముఖుల‌ను వెంటాడుతున్న క‌రోనా భ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ముఖులు ఇప్పుడు కరోనా బారిన ప‌డుతున్నారు. అయితే ఇత‌ర రాష్ట్రాల కంటే ఏపీలో రిక‌వ‌రీ రేటు కూడా ఎక్కువ‌గానే ఉంది.

తాజాగా వైసీపీ నేత‌, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వి. సుబ్బారెడ్డికి క‌రోనా సోకింది. ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న వెంట‌నే హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతానికి ఆయన ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే కొలుకుంటార‌ని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఇప్ప‌టికే ప‌లువురు అర్చ‌కులు, సిబ్బందికి తిరుమ‌ల‌లో క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా దేవ‌స్థానం చైర్మ‌న్‌కే క‌రోనా సోకింది. దీంతో మ‌రోసారి తిరుమ‌ల‌లో క‌రోనా భ‌యం అంటుకుంది. వై.వి సుబ్బారెడ్డికి క‌రోనా సోక‌డంతో ఇటీవ‌ల ఆయ‌న్ను క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటే బాగుటుంద‌ని అనుకుంటున్నారంట‌. కాగా ఇటీవ‌లె ఏపీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు సైతం క‌రోనా సోకింది. కాగా క‌రోనాతో బాద‌ప‌డుతున్న‌ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు హైద‌రాబాద్ తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు చికిత్స అందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here