ల‌వ్ జిహాద్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ నాయ‌కుడు..

ల‌వ్ జీహాద్ అంశం రోజురోజుకూ వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌కీయ పార్టీల నేత‌లు దీనిపై ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు వ్య‌క్తం చేస్తూ విష‌యాన్ని వైర‌ల్ చేస్తున్నారు. వ్యాపింపజేయాల్సింది ప్రేమే కానీ ధ్వేషం కాదని కాంగ్రెస్ నేత కేటీఎస్ తుల్సి అన్నారు. లవ్ జిహాద్ చట్టంపై ఆయన స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రేమికుల్ని కూడా వదలడం లేదంటూ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రేమికుల్ని హత్య చేయొచ్చు కానీ ప్రేమను ఎప్పటికీ చంపలేమని పునరుద్ఘాటించారు. కొందరు ప్రేమలో మతాన్ని చూస్తున్నారు. కానీ, ప్రేమే ఒక మతం. ఎవరు ప్రేమించుకుంటున్నారనేది ఆలోచించాల్సిన విషయమే కాదన్నారు. ఎందుకంటే, ప్రేమలో ఉన్నవారు సముద్రం కంటే విశాలమైన ఆలోచనలతో హృదయాలతో ఉంటారని… మీకు చాతనైతే ప్రేమికుల్ని చంపొచ్చు. కానీ, ప్రేమను ఎప్పటికీ ధ్వంసం చేయలేరన్నారు. కనీసం ఆపనైనా లేరన్నారు. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమలు కనిపిస్తుంటాయని… వారిలో మనకెక్కడా మత కోణం కనిపించదన్నారు. హీర్-రంజా, సోహ్నీ-మహిల్వాల్, సస్సుయి-పున్హున్ ఇంకా ఎన్నో ప్రేమ కథలు ఇలాంటివే అన్నారు.

కాగా ఇదే విష‌యంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడారు. లవ్ జీహాద్ వల్ల మహిళల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని అన్నారు. లవ్ జీహాద్ నిరోధించేందుకు చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇంద్రేష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ, మహిళలపై హింసకు మారు పేరు ‘లవ్ జీహాద్’ అని చెప్పారు. ఓ పురుషుడు తన వివరాలను దాచిపెట్టి, తప్పుడు వివరాలను తెలియజేసి, మహిళను మోసం చేయడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారన్నారు. మధ్య ప్రదేశ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here