104, 14410 ఎలా ప‌నిచేస్తున్నాయి.. ప్ర‌శ్నించిన వై.ఎస్ జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలా సేవ‌లు అందుతున్నాయి. ఏమైనా ఇబ్బందులుంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి అన్న దానిపై జ‌గ‌న్ అధికారుల‌తో మాట్లాడారు.

104, 14410 కాల్ సెంట‌ర్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని జ‌గ‌న్ అన్నారు. వీటి ప‌నితీరుపై అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని చెప్పారు. ఆసుప‌త్రులు, కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో భోజ‌నం, పారిశుధ్యంపై వివరాలు తెలుసుకున్నారు. టెలి మెడిసిన్ ద్వారా మందులు పొందిన వారికి కాల్ చేసి సేవ‌ల‌పై మాట్లాడాల‌న్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే స‌రిచేసుకోవాల‌న్నారు.

క‌రోనా ఆస్పత్రుల్లో సేవ‌ల‌పై ఫీడ్ బ్యాక్ తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌కు తెలిపారు. కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల్లో ఎమ్మెల్యేల భాగ‌స్వామ్యం ఉండాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కల్పించే కార్య‌క్ర‌మాలు చేయాల‌న్నారు. కోవిడ్ ఉన్న‌ట్టు అనుమానం ఉంటే ఏం చేయాల‌న్న దానిపై ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here