క‌రోనాపై సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు..

క‌రోనాపై ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు ఇచ్చారు. అధికారుల‌తో ఆయ‌న క‌రోనా ప‌రిస్థితిపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. హాస్పిట‌ల్స్‌లో మౌళిక స‌దుపాయాలు, వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల‌న్నారు.

287 హాస్పిట‌ల్స్‌లో వైద్యులు, సిబ్బంది, ఇత‌ర సౌక‌ర్యాల‌న్నీ ఉండాల‌న్నారు. ఎప్పటిక‌ప్పుడు లోపాలు స‌రిదిద్దుకొని సిబ్బంది కొర‌త లేకుండా చూడాల‌న్నారు. కోవిడ్ కార్య‌క్ర‌మాల్లో తాత్కాలికంగా నియ‌మిస్తున్న పారిశుధ్య సిబ్బందికి జీతాలు పెంచాల‌న్నారు. ఇక ఆరోగ్య‌శ్రీ కింద వ‌చ్చే పేషెంట్ల‌కు అత్యుత్త‌మ సేవ‌లందాల‌న్నారు.

మ‌నం హాస్పిట‌ల్‌కు వెళితే ఎలా ఉండాల‌ని కోరుకుంటామో అదేవిధంగా జ‌ర‌గాల‌న్నారు. హాస్పిట‌ల్స్‌లో ప్రమాణాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. కోవిడ్ కాల్ సెంట‌ర్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని సీఎం ఆదేశించారు. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి గురించి సీఎం ఆరా తీశారు. వారికి స‌క్ర‌మంగా మందులు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇక ఆరోగ్య ఆస‌రా గురించి మాట్లాడుతూ త‌ల్లులు ప్ర‌స‌వం అవ్వ‌గానే డ‌బ్బులు అందించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here