వినాయ‌క ఉత్స‌వాల‌పై బోండా ఉమ కీల‌క వ్యాఖ్య‌లు..

వైకాపా ప్ర‌భుత్వంపై టిడిపి నేత బోండా ఉమ మండిప‌డ్డారు. మ‌ద్యం షాపుల‌కు లేని కోవిడ్ నిబంధ‌న‌లు వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌కు ఎలా ఉంటాయ‌న్నారు. బ్రాందీ షాపులకు ఇచ్చిన ప్ర‌ధాన్య‌త వినాయ‌క చ‌వితికి ఎందుకు ఇవ్వ‌డం లేదన్నారు.

హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేవిధంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్రం ప‌రువు పోయింద‌న్నారు. ఈ విష‌యంలో డీజీపీ స్పందించిన తీరు హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. వైకాపా ప్ర‌భుత్వ తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థ‌లాల కొనుగోలులో అవినీతి జ‌రిగింద‌న్నారు. దీనిపై బ‌హిరంగ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇళ్ల స్థ‌లాల విష‌యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు త‌మ పార్టీ సిద్ధంగా ఉంద‌న్నారు. ఇక డ్వాక్రా మ‌హిళ‌ల విష‌యంలో కూడా జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు టోపీ పెట్టార‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు డ్వాక్రా గ్రూపుల‌కు రూ. 7 ల‌క్ష‌ల ఇస్తాన‌ని చెప్పి.. అధికారంలోకి వ‌చ్చాక చేయ‌లేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here