చ‌దువంటే ఏంటో చ‌క్క‌గా చెప్పిన జ‌గ‌న్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఏ ఉద్దేశంతో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారో ఆ దిశ‌గానే జ‌గ‌న్ ముందుకు వెళుతున్నారు. జ‌గ‌న‌న్న విద్యాకానుక ప‌థ‌కం ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.

విద్యా వ్య‌వ‌స్థ‌లో తీసుకొచ్చిన స‌మూల మార్పుల గురించి జ‌గ‌న్ వివ‌రించారు. అంగ‌న్ వాడీల ద‌గ్గ‌ర నుంచి హైస్కూల్ వ‌ర‌కు ఏవిధమైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది చెప్పారు. ప్ర‌తి ఒక్కరికీ చ‌దువే శ‌క్తి అన్నారు జ‌గ‌న్‌. ప్ర‌పంచాన్ని మార్చే ఘ‌న‌త విద్య‌కే ఉంద‌ని ఆయ‌న విద్యార్థుల‌ను ప్రోత్స‌హించారు. పిల్ల‌ల‌ను ఇంగ్లీషు మీడియంలో చ‌దివించాలంటే ఆర్థిక భారం ఏర్ప‌డిందన్నారు. అందుకే విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో స్కూల్‌కు రాకుండా ఉండేవారిపై దృష్టి పెట్ట‌లేద‌న్నారు. రూ.650 కోట్ల‌తో విద్యాకానుక‌ను అంద‌జేస్తున్న‌ట్లు సీఎం చెప్పారు. ప్ర‌తి విద్యార్థి చ‌క్క‌గా చ‌దువుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచం ఉద్యోగాలు ఇచ్చేందుకు మ‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌న్నారు. పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామ‌న్నారు. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్‌లో వేస్తున్నామని చెప్పారు. విద్యాకానుక ప‌థ‌కంపై గ్రామీణ స్థాయిలో మంచి స్పంద‌న వ‌స్తోంది. యూనిఫాం, షూస్‌, బుక్స్ ఇస్తున్నార‌న్న వార్త తెలియ‌గానే పేద ప్ర‌జ‌ల్లో సంతోషం వ్య‌క్తం అవుతోంది. ఈ ప‌థ‌కం ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకువ‌స్తోంద‌ని అంతా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here