చిరు రీఎంట్రీ తర్వాత రీమేక్‌లకే మొగ్గు చూపుతున్నాడా.?

రాజకీయాల్లో కొంతకాలం బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ దూసుకొచ్చిన చిరు కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ఇప్పుడు వరుసగా కొత్త సినిమాలకు ఓకే చెబుతూ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు. చిరు కమ్‌ బ్యాక్‌ చిత్రం ఖైదీ నెంబర్‌ 150 తమిళ రీమేక్‌ అనే విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం చిరు సినిమాల ఎంపికలు చూస్తుంటే ఎక్కువగా రీమేక్‌లపైనే ఆధారపడినట్లు అర్థమవుతోంది. అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో.. ఇతర భాషల్లో వచ్చిన అలాంటి చిత్రాలను రీమేక్‌ చేయడానికి చిరు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. చిరు ఇప్పటి వరకు ఓకే చెప్పిన సినిమాలే దీనికి ఉదాహరణ. ప్రస్తుతం చిరు లూసిఫర్‌తో పాటు వేదాళం రీమేక్‌లకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో రీమేక్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమిళ్‌లో విజయవంతమైన అన్నై అరిందాళ్ అనే సినిమాపై చిరు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్‌ హీరోగా నటించాడు. ఇక ఇందులో అజిత్‌ ఒక పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరి చిరు ఈ రీమేక్‌లో నటిస్తాడా.? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here