చిరంజీవి..! ఉయ్యాలవాడ కాలిగోటితో సమానం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో చిరంజీవి విమర్శలు ఎదుర్కోనున్నాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి…డబ్బుకోసం, కేంద్రమంత్రి పదవికోసం అదే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడన్న అపవాదును మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 10ఏళ్ల తరువాత వెండితెరపై వెలిగిపోవాలని ఖైదీనెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చాడు. వరుస ప్రాజెక్ట్ లతో జోష్ మీదున్న చిరంజీవి తదుపరి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై  నీలి నీడలు కమ్ముకున్నాయి.

స్వాతంత్ర్యానికి మునుపే తన పోరాటాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఉయ్యాలవాడ చరిత్రను చిరంజీవి చేయడం ఎంతవరకు సబబు అనే వాదనలు ఫిల్మింనగర్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ఉయ్యాలవాడ కాలిగోటితో చిరంజీవి సమానమని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత కథలో చిరంజీవి హీరోగా చేయడం కరెక్ట్ కాదనేది వాదన. ఒకవేళ ఈ సినిమాను చిరజీవి చేస్తే లాభం చేకూర్చకపోగా, విమర్శకుల చేతిలో అస్త్రంగా మారుతుందని పొలిటికల్ క్రిటిక్స్ చెబుతున్నారు.

కానీ ఎన్ని విమర్శలు వచ్చినా ఉయ్యాలవాడ గురించి రోజు ఏదో ఒకటి వినిపిస్తుంది. చూద్దాం చిరంజీవి ఉయ్యాలవాడ చేస్తారా లేక ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరుకుతాడా అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here