భారత్ దే ‌ తప్పన్న చైనా.. వెంట‌నే స‌మాధానం చెప్పిన ఇండియా

స‌రిహ‌ద్దుల విష‌యంలో చైనా త‌న వ‌క్ర‌బుద్దిని బ‌య‌ట‌పెడుతూనే ఉంది. ర‌క్ష‌ణ మంత్రుల స‌మావేశంలో పాల్గొన్న భార‌త్‌, చైనా మంత్రులు విడివిడిగా భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌ను భార‌త్ ఎండ‌గ‌ట్టింది. ఇప్ప‌టికైనా త‌న బ‌ల‌గాల‌ను చైనా ఉప‌సంహ‌రించుకోవాల‌ని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.

అయితే స‌మావేశంలో సైలెంట్‌గా ఉన్న చైనా ఆ త‌ర్వాత ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భార‌త్ వ‌ల్లే స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త‌లు చెల‌రేగుతున్నాయ‌న్నట్లు తెలిపింది. త‌మ భూభాగంలోని ఒక్క అంగుళం కూడా వొదులుకోవ‌డానికి తాము సిద్ధంగా లేమ‌ని చైనా స్ప‌ష్టం చేసింది. భార‌త్ చ‌ర్య‌ల వ‌ల్లే ఇరు దేశాల మ‌ద్య ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయ‌ని తెలిపింది.

త‌మ స‌రిహ‌ద్దులు కాపాడుకునేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని చైనా పేర్కొంది. చ‌ర్చ‌ల ద్వారానే ఉద్రిక్త‌త‌ల‌ను ప‌రిష్క‌రించుకోగ‌ల‌మ‌ని తెలిపింది. ఇక చైనా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌గానే భార‌త్ కూడా మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌మ సార్వ‌భౌమాదికారం, స‌మ‌గ్ర‌తకు క‌ట్టుబడి ఉంటామ‌ని తెలిపింది. చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల మేధావులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చైనా కావాల‌నే ఇలా రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోందంటున్నారు. స‌రిహ‌ద్దులో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అన్న యుద్ద వాతావ‌ర‌ణం ఉంటుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here