క‌రోనాపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న ముఖ్య‌మంత్రి..

దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. ప్ర‌త్యేకంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ ప‌రిస్థితి నెల‌కొంది. దేశరాజధాని ఢిల్లీ తరువాత కరోనా వైరస్ ముంబైలో తన ప్రతాపం చూపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరోమారు విజృంభించాయని, ఇప్పుడు ఇది కరోనా వేవ్ కాదని, సునామీ అని పేర్కొన్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశంగా మారిందని అన్నారు. కరోనాకు అడ్డుకట్టవేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, బాధితులకు తగినంతగా వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. 8 నెలలుగా కరోనాతో పోరాటం సాగస్తున్నామన్నారు. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. మహారాష్ట్రలో 12 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ రెండు డోసుల చొప్పున కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తం 24 కోట్ల డోసులు అవసరమవుతాయన్నారు.

అయితే ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతున్నదనేది స్పష్టం కావడంలేదన్నారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని కోరారు. అయితే చాలామంది మాస్క్‌లు పెట్టుకోవడం లేదని. ఇది ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. కరోనా అంశాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ మాట్లాడుతూ పండుగల అనంతరం కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రానున్న 8-10 రోజులు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here