చెర్రీని ఇంప్రెస్‌ చేయలేకపోయిన ‘భీష్మ’ దర్శకుడు..?

‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. చేసిన రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో ఈ దర్శకుడిపై అందరి దృష్టి పడింది. దీంతో తర్వాతి చిత్రాన్ని పెద్ద హీరోతో తీయాలని ఫిక్స్‌ అయిన వెంకీ.. తన తర్వాతి ప్రాజెక్టును మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే చెర్రీకి కథను కూడా చెప్పినట్లు సమాచారం. అయితే తాజాగా దీనికి రామ్‌ చరణ్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. వెంకీ చెప్పిన నేరేషన్‌తో చరణ్‌ ఇంప్రెస్‌ కాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వెంకీకి రామ్‌ చరణ్‌ ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని టాక్‌. మరి స్క్రిప్ట్‌లో ఏవైనా మార్పులు చేర్పులతో వెంకీ మళ్లీ చెర్రీని ఒప్పిస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో నటిస్తోన్న రామ్‌ చరణ్‌.. ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో అతిధి పాత్రలో నటించనున్నాడు. అనంతరం రామ్‌ చరణ్‌ నటించబోయే చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here