‘చావు కబురు చల్లగా’ చెప్తోన్న కార్తికేయ.. 

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు యంగ్ కార్తికేయ. తర్వాత ‘హిప్పీ’, ’99 ఎమ్ఎల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తికేయ..  ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మాత‌గా, యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కార్తికేయ శవాలను స్మశాననికి తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ గా పక్కా మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here