డిసెంబర్లో సెట్స్ పైకి చరణ్, బోయపాటి ..

బోయపాటి .. చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంతన్నది తెలియక అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో .. ఈ కాంబినేషన్ సెట్ అయిన విషయం నిజమేనని తెలుస్తోంది.
 అసలు ‘జయ జానకీ నాయక’ తరువాత బాలకృష్ణతో బోయపాటి చేయవలసి వుంది. కానీ బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ సినిమాతో బిజీ. ఆ తరువాత సినిమాను ఆయన పూరీతో చేయనున్నాడు. ఇక చరణ్ .. ‘రంగస్థలం’ తరువాత సినిమాను కొరటాలతో చేయాలనుకున్నాడు. కానీ ఆయన ‘భరత్ అను నేను’ మూవీతో బిజీగా వున్నాడు. అందువలన చరణ్ .. బోయపాటి తమ కాంబినేషన్ ను సెట్ చేసుకున్నారట.
డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసి .. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరాకి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here