RGV కలలోకి రోజూ వస్తున్న సీనియర్ ఎన్టీఆర్ .. నిజమా అబద్ధమా

తాను తలపెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా స్క్రిప్ట్ విషయంలో దివంగత మహానుభావుడు నందమూరి తారక రామారావు స్వయంగా గైడ్ చేస్తున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ తనకు అపారమైన సమాచారాన్ని అందిస్తున్నారని చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ప్రతి రోజూ ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ విషయంలో సహకరిస్తున్నారని చెప్పాడు. ఆయన ఆత్మ తనతో మాట్లాడుతోందని, సినిమా ఎలా ఉండాలన్న విషయమై సలహాలు, సూచనలు ఇస్తోందని చెప్పాడు.
“లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది” అని ట్వీట్ చేశాడు. దేవుళ్లను, ఆత్మలను నమ్మని వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. ఇదొక ప్రచార వ్యూహమని టాలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here