చంద్ర‌బాబు స్రిప్టు రాస్తే.. సీపీఐ చ‌దువుతోందా…!

తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్ర‌బాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును చ‌దువుతున్నార‌ని బీజేపీ నేత‌లు సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై మండిప‌డుతున్నారు. ఇత‌రుల‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేద‌న్నారు.

రాష్ట్రంలో ఎలాంటి రాజ‌కీయాలు చేయాలో త‌మ‌కు తెలుస‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధి పురిఘ‌ళ్ల ర‌ఘురాం అన్నారు. సీపీఐ రామ‌కృష్ణ‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఎలాంటి రాజ‌కీయాలు చేయాలో టిడిపి, సీపీఐ, కాంగ్రెస్ మాకు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

రామ‌కృష్ణ ఆయ‌న పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకుంటే మంచిద‌న్నారు. రామకృష్ణ‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజీపీ లేద‌ని చెప్పారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్రిప్టును పేరు మార్చి చ‌దువుతార‌ని మండిప‌డ్డారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here