వ‌ర్మ ఇలా ఓ వ‌ర్గాన్ని ట‌ర్గెట్ చేసి మాట్లాడుతున్నారా ..!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తీసిన మ‌రో వివాదాస్ప‌ద చిత్రం విడుద‌ల‌కు రెడీ అయ్యింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌పై వ‌ర్మ తీసిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇదే సంద‌ర్బంలో ప్ర‌స్తుతం రాంగోపాల్ వ‌ర్మ ప‌వ‌న్ స్టార్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌ అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రూపొందించారు. ఇందులో మ‌రీ ప్ర‌త్యేకంగా ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి అంకితం అని కూడా ట్రైల‌ర్‌లో చూపించారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి , రాం గోపాల్ వ‌ర్మ‌కు ప‌డ‌టం లేద‌న్నద దాదాపుగా అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయిన‌ప్ప‌టికీ వ‌ర్మ మాత్రం ప‌వ‌ర్ స్టార్‌నే టార్గెట్ చేశారా అన్న వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న విభిన్న ద‌ర్శ‌కుడైతే ఎన్నో సినిమాలు తీసుకోకుండా ఇలా వివాదాస్ప‌ద చిత్రాలు తీయ‌డ‌మేంట‌ని ఎంతో మంది బ‌హిరంగంగానే మాట్లాడుతున్నారు.

తాజాగా హీరో నిఖిల్ విష‌యంలో కూడా వ‌ర్మ అత‌నెవ‌రో నాకు తెలియ‌ద‌ని కామెంట్లు చేశారు. వీరంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొత్తుల‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే కేవ‌లం మూవీని ప్ర‌మోట్ చేసుకునేందుకే వ‌ర్మ ఇలా ఓ వ‌ర్గాన్ని ట‌ర్గెట్ చేసి మాట్లాడుతున్నారా అన్న చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే ప‌వ‌ర్ స్టార్ లాంటి వారిపై సినిమాలు తీస్తూ సొమ్ముచేసుకునేందుకు రెడీ అయ్యార‌ని టాక్ వ‌స్తోంది. కేవ‌లం స్టార్ హీరో అన్న కార‌ణంతో ఇలా ప‌వ‌న్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు సినిమాలు తీస్తున్నార‌ని అభిమానులు మండిప‌డుతున్నారు.

ఇక ఆర్జీవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసినప్పుడే ప‌వ‌న్ ఫ్యాన్ష్ ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు. ట్రైల‌ర్‌ను డిస్‌లైక్ కొట్టించేశారు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తే మ‌రి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మ‌రి. ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 10లక్ష‌ల‌కు పైగా చూశారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫాంపై ఆర్‌జివి వ‌ర‌ల్డ్ థియేట‌ర్ (rgvworldtheatre.com) లో సినిమా విడుద‌ల చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here