సినిమా రివ్యూ: దిల్ బేచారా

Release Date : 24 జులై, 2020

Starring : సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజనా సాంఘి తదితరులు

Director : ముఖేష్ చబ్రా

Music Director : ఏ.ఆర్.రెహమాన్

Producer : సంజీవ్ వర్మ

Banner : ఫాక్స్ స్టార్ స్టూడియోస్

“ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే ఆంగ్ల నవల ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ఆధారంగా తీసిన చిత్రం “దిల్ బేచారా”. బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించిన ఆఖరి చిత్రం. సుశాంత్ కు నివాళిగా హాట్ స్టార్ ఈ చిత్రాన్ని అందరూ ఉచితంగా చూసే ఆప్షన్ ఇచ్చింది. జూన్ 24 సాయంత్రం నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..!!

కథ: కిజి బసు (సంజనా సాంఘి) చిన్నప్పటి నుండి థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుంది. ముక్కుకి ఆక్సిజన్ పైప్, భుజాన ఆక్సిజన్ సిలిండర్ లేనిదే గంటసేపు కూడా స్వేచ్ఛగా బ్రతకలేని అమ్మాయి. ఆమెకు కాలేజ్ లో పరిచయమవుతాడు ఇమ్మాన్యుల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మ్యానీ (సుశాంత్ సింగ్ రాజ్ పుట్). ఓ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయి.. ప్రోస్థెటిక్ లెగ్ తోనే అందరినీ నవ్విస్తూ బ్రతికేస్తుంటాడు. ఈ ఇద్దరూ కాలేజ్ లో పరిచయస్తులుగా మారి, అనంతరం ప్రేమించుకొని.. వాళ్ళిద్దరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అభిమన్యు వీర్ (సైఫ్ అలీఖాన్)ను కలవడానికి ప్యారిస్ వెళ్తారు. అక్కడ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొన్న కిజి-మ్యానీలకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటీనటుల పనితీరు: సుశాంత్ సింగ్ నవ్వు, సహజమైన నటన, స్పష్టమైన భావ వ్యక్తీకరణ బుల్లితెరపై చూస్తుంటే ముచ్చటేస్తుంది. సంజనా సాంఘి అద్భుతంగా చేసింది. తల్లి పాత్రలో స్వస్తికా ముఖర్జీ, తండ్రిగా సశ్వతా చటర్జీలు ఆకట్టుకున్నారు. బెంగాలీ నటులు కావడంతో.. బెంగాళీ పేరెంట్స్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. అతిధి పాత్రలో సైఫ్ అలీఖాన్ మెప్పించడానికి ప్రయత్నించాడు.

విశ్లేషణ: సుశాంత్ సింగ్ రాజ్ పుట్ని తప్ప వేరేమీ జనాలు పట్టించుకోరు కాబట్టి తప్పకుండా అందరికి నచ్చే సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here