సినిమా రివ్యూ : 36 వ‌య‌సులో..

Release Date : 24 జులై, 2020
Starring : జ్యోతిక, రెహమాన్ తదితరులు
Director : రోషన్ ఆండ్రూస్
Music Director : సంతోష్ నారాయణ్
Producer : సూర్య
Banner : 2డి ఎంటర్ టైన్మెంట్

జ్యోతిక న‌టించిన త‌మిళ చిత్రం `36 వ‌య‌దిలిలే`. మలయాళ చిత్రం “హౌ ఓల్డ్ ఆర్ యు”కు రీమేక్ ఇది. ఇప్పుడు దీన్ని తెలుగులో ’36 వ‌య‌సులో’ పేరుతో డ‌బ్ చేశారు. త‌మిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా యాప్ తెలుగులో విడుదల చేసింది.. త‌మిళంలో ప‌లు అవార్డులు అందుకున్న సినిమా. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? 36 ఏళ్ల వ‌య‌సున్న జ్యోతిక ఏం చేసింది?

కథ: వసంతి (జ్యోతిక) గవర్నమెంట్ ఆఫీస్ లో పద్నాలుగేళ్ళుగా వర్క్ చేస్తున్న సగటు మధ్యతరగతి గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే వసంత కోరిక. అనుకోని విధంగా ఆమె కలలు ఒక్కసారిగా మటుమాయమవుతాయి. తన కల సాకారం చేసుకోవడానికి వసంత ఏం చేసింది? ఆమె జీవితాన్ని మార్చేసిన సంఘటన ఏమిటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌: వ‌సంతిని చూస్తుంటే.. దేశంలోని 80 శాతం గృహిణులే క‌ళ్ల ముందు క‌దులుతుంటారు. భ‌ర్త‌, పిల్ల‌లు, సంసారం అంటూ త‌మ ఉనికిని కోల్పోతున్న స్త్రీలే గుర్తొస్తారు. అలాంటి పాత్ర చుట్టూ ఓ క‌థ అల్లుకోవ‌డం.. దాన్ని రెండు గంట‌ల పాటు ఆస‌క్తిగా చెప్ప‌డం త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. ఓ అమ్మాయిల ఆశ‌ల‌కు, క‌ల‌ల‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అనే ప్ర‌శ్న నుంచి ఈ క‌థ పుట్టుకొచ్చింది. రాష్ట్ర‌ప‌తిని క‌దిలించే ప్ర‌శ్న కూడా ఇదే. దానికి స‌మాధానం కూడా ఈ క‌థ‌లోనే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ వీకెండ్ కి ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ, చూడాల్సిన సినిమా ఇది. పెద్ద పెద్ద ట్విస్టులు క‌నిపించ‌వు. ఓ న‌వ‌ల చ‌దువుతున్న ఫీలింగ్‌. నేప‌ధ్య సంగీతం ఆహ్లాద‌కరంగా ఉంటుంది. అక్క‌డ‌క్క‌డ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు, వాళ్ల క‌ల‌ల గురించి చెప్పే సంద‌ర్భాల‌లో మాట‌లు న‌చ్చుతాయి.

న‌టీన‌టులు: జ్యోతిక సినిమా అంతా తానే క‌నిపిస్తుంది. త‌న అనుభ‌వం మ‌హ‌బాగా రంగ‌రించింది. ఆ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. అమాయ‌క‌త్వం, అమ్మ‌ద‌నం, జెల‌సీ, వ‌య‌సు మీద ప‌డుతున్న భ‌యం… ఇలా ఎన్నో క‌నిపిస్తాయి. త‌న‌ని స‌మాజం ఏమంటున్నా ప‌ట్టించుకోని ఓ గృహిణి.. భ‌ర్త పిల్ల‌లు త‌న‌ని కించ‌పరిస్తే ఎంత గిల‌గిల‌లాడిపోతుందో.. త‌న న‌ట‌న‌తో చూపించ‌గ‌లిగింది. రెహ‌మాన్ ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి భ‌ర్త‌గా త‌న పాత్ర‌లో ఒద‌గిపోయాడు.

రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here