రాజ‌కీయాలు చేస్తున్నారు.. చంద్ర‌బాబు

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. వ‌ర‌ద బాదితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. పంట‌లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని ఆయ‌న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ చేత‌కాని త‌నం వ‌ల్లే ఈ దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

పేద ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల్సిన స‌మ‌యంలో రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. వ‌ర‌ద స‌హాయం కింద ఒక్కో కుటుంబానికి రూ. 10వేలు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మెడిక‌ల్ క్యాంపులు నిర్వ‌హించాల‌న్నారు. ఇక అమ‌రావ‌తి గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోస‌మే అమ‌రావ‌తి అని చెప్పామ‌న్నారు. విధ్వేషాలు రెచ్చ‌గొట్టేలా అమ‌రావ‌తిపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.

మూడు ముక్క‌లాట ఆడే ధైర్యం ఎవ‌రిచ్చార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ధైర్య‌ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చెప్పారు. మీకు మెజార్టీ వ‌స్తే మేం మాట్లాడబోమ‌న్నారు. వైసీపీ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేసింద‌న్నారు. రాజ‌ధానికి భూములిచ్చిన రైతులు ఆందోళ‌న‌లు చేస్తుంటే క‌నిక‌రం లేదా అన్నారు చంద్ర‌బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here