చంద్రబాబు క‌రోనా వెబ్‌సైట్‌ రాజ‌కీయం..

ఏపి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు పార్టీ ప‌రిస్థితి దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. పార్టీలోని నేత‌లంతా ఇప్పుడు త‌మ దారితాము చూసుకుంటున్నారు. ఇప్పటికే ప‌లువురు నేత‌లు పార్టీ మార‌గా..మ‌రికొంద‌రు అదే దారిలో వెళ్లేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్లు చేస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబా నాయుడు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నారు. దీంతో క‌రోనా పేరు చెప్పి ఓ వెబ్ సైట్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏదో మంచి చేస్తామ‌ని ఆయ‌న చెప్పుకుంటున్నా ఫైన‌ల్ గా జ‌రిగేది మాత్రం వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డ‌మే అని చెబుతున్నారు. దేశంలో క‌రోనా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నాయి.

ఏపీలో అయితే సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా క‌రోనా కేసుల గురించి ప‌ర్య‌వేక్షించారు. కాగా ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. షాపింగ్ మాల్స్‌, హోట‌ల్స్, స్కూల్స్ ఇలా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కానీ చంద్ర‌బాబు మాత్రం క‌రోనా వెబ్ సైట్ పెట్టి దీని ద్వారా ప్ర‌భుత్వంపై ఇష్టానురీతిన మాట్లాడేందుకు ఇలా చేస్తున్నార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇక చంద్ర‌బాబు రాజ‌కీయ ఎత్తుగ‌డల్లో ఇది కూడా ఒక‌ట‌ని అంటున్నారు. ఎందుకంటే పార్టీ ఇప్పుడున్న గ‌డ్డు ప‌రిస్థితుల్లో చంద్రబాబు ఏ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు. పార్టీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడి నిర్ణ‌యం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అచ్చెన్నాయుడును ఫిక్స్ చేశార‌ని లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చినా అది ఇంకా జ‌ర‌గ‌లేదు. దీంతో ఓ వెబ్‌సైట్‌ను పెట్టి ఇలా రాజ‌కీయాలు చేస్తున్నారని రాజ‌కీయాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here