విద్యుత్ పై చంద్ర‌బాబు కామెంట్స్.. వైసీపీ కౌంట‌ర్ కోసం వెయిటింగ్

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న విధానాల‌పై టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటం త‌ర్వాత సాధించుకున్న ఉచిత విద్యుత్ విష‌యంలో ఇప్పుడు మ‌ళ్లీ మీట‌ర్లు పెట్టాల‌ని చూడ‌టం దుర్మార్గ‌మ‌న్నారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను య‌ధాత‌ధంగా పున‌రుద్ద‌రించాల‌న్నారు. న‌గ‌దు బ‌దిలీ పేరుతో మీట‌ర్లు బిగించి రైతుల ప్రాణాలు తీయ‌డ‌మే అని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమతో పాటు రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం తక్ష‌ణ‌మే జీవో నెంబ‌ర్ 22ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలోనే విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికామ‌ని చెప్పారు. ఎన్‌.టి రామారావు ఉన్న‌ప్పుడే రైతుల బాధ‌ల‌ను గుర్తించార‌న్నారు. ఇక రాష్ట్రంలో అప్పులు చెయ్య‌డం ఎక్కువ‌వుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నార‌ని ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఇక ఈ విష‌యంపై క‌చ్చితంగా వైసీపీ కౌంట‌ర్ ఇస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్ర‌జ‌ల అభివృద్ధే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం సాగుతోంద‌ని మంత్రులు ప‌దేప‌దే చెబుతూఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు తెచ్చింది టిడిపినే అని చెప్ప‌డంపై క‌చ్చితంగా వైసీపీ త‌మ‌దైన శైలిలో స్పందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here