అమిత్ షా ఆరోగ్యంపై హోంశాఖ క్లారిటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం పై హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. కరోనా బారిన పడిన హోంమంత్రి అమిత్ షా కు కరోనా నెగటివ్ వచ్చిందన్న వార్తను హోంశాఖ తోసిపుచ్చింది.

ఈ నెల 2వ తేదీన అమిత్ షా కరోనా బారిన పడినట్లు ఆయనే వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు గురుగ్రాం లోని ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు నెగటివ్ వచ్చిందని ఆపార్టీ ఎంపీ మనోజ్ తీవారి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు అమిత్ షా కు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. దీంతో ఈ విషయంపై హోంశాఖ స్పందించింది. ఆయనకు ఎలాంటి కరోనా పరీక్షలు నిర్వహించలేదని ఓ అధికారి తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తే తామే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అనంతరం సదరు ఎంపీ ఆయన ట్వీట్ ను డిలీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here