క‌రోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌.. ఎయిమ్స్‌లో కేసు న‌మోదు..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఎలాగోలా క‌రోనా నుంచి కోలుకున్నామ‌నుకుంటే ఆ త‌ర్వాత ఎన్నో దుష్ప‌లితాలు ఎదుర‌వుతున్నాయి. క‌రోనా వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత ప‌లు ఆరోగ్య  స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు. అయితే క‌రోనా సోకిన త‌ర్వాత ఏకంగా కంటి చూపుపైనే ప్ర‌భావం ప‌డింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ప్ర‌స్తుతం ఎయిమ్స్‌లో ఉన్నాయి.

క‌రోనా సోకిన ఓ 11 ఏళ్ల బాలిక‌కు వైర‌స్ కార‌ణంగా ఎక్కూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్‌) వ్యాధి వ‌చ్చింది. ఈ కేసు ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో నమోదైంది. కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించింది. కరోనా బారిన పడ్డ 11 ఏళ్ల బాలికలో వైరస్ కారణంగా కలిగిన ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్(ఏడీఎస్) వ్యాధిని గుర్తించారు. ఈ వయసు పిల్లల్లో ఇటువంటి వ్యాధి రావడం ఇదే తొలిసార అని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుంది. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో ముఖ్యం. అయితే వైరస్ కారణంగా..ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడింది.

అనంత‌రం బాలిక చూపు మంద‌గించింది. అయితే వైద్యులు చిక‌త్స చేసిన త‌ర్వాత 50 శాతం చూపు మెరుగైంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇటీవ‌లె ఈమెను డిశ్చార్జ్ కూడా చేశారు. ఈమెకు వ‌చ్చిన ఈ వ్యాధి ద్వారా  కంటిచూపుతో పాటూ కండరాల కదలికలు, ఇతర ఇంద్రియాలు, మూత్రాశయం, వంటివి ప్రభావితమవుతాయని డాక్టర్లు తెలిపారు. క‌రోనాతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇలాంటి వ్యాదులు వస్త‌య‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here