ఎన్డీఏలోకి జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తున్న బీజేపీ..?

దేశంలో మ‌రో చ‌రిత్ర సృష్టించ‌బోతున్నారు వై.ఎస్ జ‌గ‌న్‌. కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేప‌ట్టిన బీజేపీ జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీని ఎన్డీఏలో క‌ల‌వ‌మ‌ని కోరుతోంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే వారం జ‌గ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీతో జ‌గ‌న్ భేటి అవుతార‌ని స‌మాచారం.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మోదీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాల‌ని వైసీపీ అధినేత‌కు బీజేపీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఎన్డీఏలో వైసీపీ లాంటి బ‌ల‌మైన పార్టీని భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని మోదీ టీం భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే శివ‌సే, అకాలీద‌ళ్ పార్టీలు ఎన్డీఏలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో బీజేపీ కొత్త మిత్రుల కోసం అన్వేష‌ణ చేస్తోంద‌ట‌. ఇందులో ప్ర‌ధానంగా ఏపీ నుంచి వైసీపీని తీసుకోవాల‌ని ఫిక్స‌యింద‌ని తెలుస్తోంది. ప్ర‌జా నాయ‌కుడు జ‌గ‌న్ ఇప్ప‌టికే బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ స‌ఖ్య‌త‌గా సాగుతున్నారు. అయితే ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి త‌మ‌తో ముందుకు సాగాల‌ని బీజేపీ కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

దీనిపై జ‌గ‌న్ మాత్రం ఏం నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. మూడు కేంద్ర మంత్రి ప‌ద‌వులు జ‌గ‌న్‌కు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంది. అయితే వైసీపీ మాత్రం ఇంకా దీనిపై పూర్తి క్లారిటీతో లేద‌ని తెలుస్తోంది. మ‌రో వారం రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. బీజేపీ మాత్రం జ‌గ‌న్‌ను క‌చ్చితంగా భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని అనుకుంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే అన్ని విదాలా ఆలోచించి వైసీపీ కూడా బీజేపీతో క‌లిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here