ఇక వెండితెరపై ‘శక్తిమాన్’ సాహసాలు..!

శక్తిమాన్ ధారావాహిక… 90లో దశకంలో వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాంటి సూపర్ హీరోలు వచ్చారు కానీ.. ఒకప్పుడు మాత్రం శక్తిమానే.. సూపర్ హీరో. 90వ దశకంలో దూరదర్శన్ లో ప్రసారమైన ఈ ధారావాహిక… చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. శక్తిమాన్ పాత్రను పోషించిన ముఖేష్ కన్నా.. తన అద్భుత నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశాడు.

 ఇదిలా ఉంటే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శక్తిమాన్ మరోసారి ప్రేక్షకులను తన అసమాన ధైర్య సాహసాలతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు అయితే ఈసారి బుల్లి తెరపై కాకుండా వెండితెరపై ప్రత్యక్షం కానున్నాడు. అవును… మీరు చదివింది నిజమే శక్తిమాన్ కథను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి శక్తిమాన్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు ముఖేష్ కన్నా స్వయంగా తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here