క్వారంటైన్‌లోకి వెళ్లిన బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు..?

బిగ్‌బాస్ 4పై అంచ‌నాలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. కంటెస్టెంట్ల పేర్లు ఒక్క‌క్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో అభిమానులు షో కోసం ఎదురుచూస్తున్నారు. కాగా షో గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్ప‌టికే పూర్త‌న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే ప‌లువురి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే తాజాగా సెల‌క్ట‌యిన కంటెస్టెంట్ల‌ను హైద‌రాబాద్‌లోని ఓ పెద్ద హోట‌ల్ రెంట్‌కు తీసుకొని అందులో పెట్టార‌ని తెలుస్తోంది. వీరి క్వారంటైన్ పూర్త‌యిన త‌ర్వాత నేరుగా అన్న‌పూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ల‌నున్నారు.

మూడు సీజ‌న్ల‌కు భిన్నంగా బిగ్‌బాస్ 4లో ఉండ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక పూర్త‌యింది. వీరిలో మొన్న యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ పేరు కూడ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్పుడు మ‌రికొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో టీవీ న‌టుడు ర‌ఘు, క‌రాటే క‌ల్యాణి, లాస్య‌, సింగ‌ర్ నియోల్‌తో పాటు మ‌రి కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్ప‌టికే ఎంపిక చేసిన వారంద‌రినీ క్వారంటైన్లో ఉంచార‌ట‌. ఇక షో డేట్స్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు కాబ‌ట్టి ఈ వ్య‌వ‌హార‌మంతా పూర్త‌య్యాక త్వ‌ర‌లోనే ఓ శుభ‌ముహూర్తాన బిగ్‌బాస్ 4 ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here