హీరో నానికి సంబంధించిన బిగ్ రూమ‌ర్..

2020 సంవ‌త్స‌రం అంద‌రికీ క‌లిసిరాలేదు. ఇక ప్ర‌ధానంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ విష‌యానికి వ‌స్తే సినిమాలు ఏమీ రాలేదు. అస‌లు షూటింగ్‌లు ఎక్క‌డికక్క‌డ ఆగిపోయాయి. అయితే క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లించిన నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీలో అంద‌రూ బిజీ అయిపోయారు. అగ్ర‌హీరోల ద‌గ్గ‌ర నుంచి ఆర్టిస్టుల వ‌ర‌కు అంద‌రూ ఎవ‌రి సినిమాలు వారు చేసుకుంటూ ఉన్నారు.

ప్ర‌స్తుతం ఇంకా పూర్తి స్థాయిలో థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌లేదు. దీంతో అంద‌రూ నెమ్మ‌దిగా ఓటీటీల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే కోవ‌లోకే నేచుర‌ల్ స్టార్ నాని కూడా వ‌చ్చేశాడు. ట్రెండ్‌ను ఫాలో అవుతూ నేచురల్ స్టార్ డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నాడట. నెట్ ఫ్లిక్స్ రూపొందించే ఓ సిరీస్‌లో నాని ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలలుగా ఈ సిరీస్ కోసం నానితో మంతనాలు జరుపుతోందట నెట్ ఫ్లిక్స్. ఫైనల్‌గా నెట్ ఫ్లిక్స్ సిరీస్‌కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ వంటి బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్స్‌తో మంచి దూకుడుమీదున్నాడు నాని. మ‌రి ఈ సినిమాలు ఉన్న నేప‌థ్యంలో డిజిట‌ల్ ఎంట్రీ ఏ మాత్రం ఉందో తెలియాలంటే వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here