అవ‌స‌ర‌మైతే కాల్చి పారేయ‌మ‌ని చెప్పేశారంట‌..

భారత్ చైనా స‌రిహ‌ద్దులో ఎలాంటి ప‌రిస్తితులు ఉన్నాయో తెలిసిందే. కొన్ని నెల‌లుగా కొన‌సాగుతున్న ఈ ప‌రిస్థితుల్లో చైనా ఆక్ర‌మ‌ణ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. అయితే తాజాగా జ‌రిగిన చ‌ర్చలు కొంత ఫ‌లితాన్ని ఇచ్చిన‌ప్ప‌టికీ అవ‌స‌ర‌మైతే కాల్చేయాల‌ని భార‌త్ డిసైడ్ అయ్యిందంట‌.

ఇరు దేశాల స‌రిహ‌ద్దులో పాత ప‌రిస్థితులు రావాల‌ని ఇరు దేశాల చ‌ర్చ‌ల్లో నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇందు కోసం ఇప్పుడున్న బ‌ల‌గాల‌ను ఇరు దేశాలు వెన‌క్కు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగానే స‌రిహ‌ద్దులో బ‌ల‌గాలు ఉప‌సంహ‌రించుకునేందుకు భార‌త్, చైనా సిద్ధ‌ప‌డుతూ ఉన్నాయి. అయితే ముందుగా భార‌త్ త‌న సైన్యాన్ని వెన‌క్కు తీసుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న చైనా చేసింద‌ని తెలిసింది. అది కూడా భార‌త్ కు మంచి బ‌లం ఉన్న ప్రాంతంలో చేయాల‌ని చెప్పింది.

దీనికి ఇండియా ఒప్పుకోకుండా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఒకే సారి బ‌ల‌గాల ఉప సంహ‌ర‌ణ జ‌ర‌గాల‌ని తేల్చిచెప్పింద‌ట‌. అంతే కాకుండా స‌రిహ‌ద్దులో చైనా ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించినా కాల్చేయండ‌ని బ‌ల‌గాల‌కు ఆదేశాలు అంద‌జేశారని తెలుస్తోంది. ఇన్ని రోజులు కాల్పులు జ‌ర‌ప‌కుండా ఉన్నామ‌ని ఇక నుంచి ప‌రిస్థితులు అదుపు త‌ప్పితే కాల్చేయాల‌ని డిసైడ్ అయ్యారంట‌. ఇందుకోసం అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకున్న అత్యాధునిక సిగ్ సావ‌ర్ తుపాకులు సైన్యానికి అందించారు. ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చైనాకు కూడా చెప్పార‌ని తెలుస్తోంది. మ‌రి చైనా ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్ప‌టికే చైనా ప‌లు మార్లు గాల్లో కాల్పులు జ‌రుపుతూ రెచ్చ‌గొట్టిన ప‌రిస్థితులు జ‌రిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here