మరో పీరియాడిక్‌ పాత్రలో బాలయ్య..?

నట సింహం బాలకృష్ణ మాస్‌ సినిమాల్లో ఎంత బాగా నటిస్తాడో.. పురాణ ఇతిహాసాల్లోనూ అంతే గొప్పగా నటిస్తాడు. గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం బాలయ్యకే చెందుతుంది. ఇక ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణిలో అలాంటి పాత్రనే పోషించిన బాలకృష్ణ ఇప్పుడు మరోసారి పీరియాడిక్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర మరెదో కాదు తెలంగాణకు చెందిన గోనా గన్నా రెడ్డి. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన రుద్రమ దేవి చిత్రంలో బన్నీ ఈ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్‌ తెలంగాణ యాసలో అదరగొట్టాడు.

ప్రస్తుతం బాలకృష్ణ చూపు ఈ పాత్రపై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య ఈ పాత్రపై పరిశోధన చేసేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేశాడని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.. ఎవరు దర్శకత్వం వహిస్తారు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే గోనా గన్నారెడ్డి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here