బాల‌కృష్ణ సినిమా హీరోయిన్ క్యాన్సిల్‌.. ?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్నారు. ముందుగానే అంజ‌లి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌యాగ మార్టీన్‌, పూర్ణ‌ను తీసుకున్నారు. అయితే వీరిలో ఓ హీరోయిన్ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని స‌మాచారం.

ఆమె ఎవ‌రో కాదు అంజ‌లి. సినిమాకు సంబంధించిన విష‌యాల్లో అభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో ప్రాజెక్టు నుంచి అంజ‌లి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ సినిమా షూటింగ్ కోసం అంజ‌లి హైద‌రాబాద్‌లో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే చిత్ర బృందం అంజ‌లిని క‌లిసి మాట్లాడిందంట‌. ఏది ఏమైనా మొత్తానికి అంజ‌లి సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ని గ‌ట్టిగానే చెబుతున్నారు. మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో చిత్ర బృందం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఇటు బాల‌య్య బాబు, అటు బోయ‌పాటి శీను చాలెంజ్‌గానే తీసుకున్నారు.

బాలకృష్ణ సినిమాలో రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఒక‌టి రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌.. మ‌రొక‌టి అఘోరా పాత్ర‌. ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాల‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంత‌వ‌ర‌కు క‌న్ఫామ్ చేయ‌లేదు. బాల‌య్య ఫ్యాన్స్ కూడా సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here