ఇండియాలో ట్రంప్‌కు అభిమానులు ఉన్నారో శ‌త్రువులు ఉన్నారో తెలిసిపోయింది..

నేడు అమెరికా అధ్యక్ష్య ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతూ ఉంది. దీనిపై ప్ర‌పంచం మొత్తం ఫోక‌స్ పెట్టింది. అయితే ఇండియాలో కూడా అమెరికా ఎన్నిక‌ల టెన్ష‌న్ క‌నిపిస్తోంది. ఎవ‌రు గెలుస్తార‌న్న ఆలోచ‌న అంద‌రిలోనూ ఉంది. ట్రంప్ గెలిచినా, బైడెన్ గెలిచినా అది అమెరికాకు సంబంధించిన మ్యాట‌ర్‌.

అయితే ఇండియా ప్ర‌జ‌ల్లో మాత్రం ట్రంప్ పేరు వినిపిస్తోంది. ట్రంప్ అనుకూలంగానో వ్యతిరేకంగానో కానీ ట్రంప్ జపం అయితే చేస్తున్నారు. ఇండియన్ ట్విట్టర్‌లో మాత్రం బైడెన్ కనిపించడం లేదు. బైడెన్ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్-29లో కాసేపు మాత్రమే కనిపించింది. కానీ ట్రంప్ హ్యాష్‌ట్యాగ్ మాత్రం టాప్-10లో కొనసాగుతోంది. ఇది ట్రంప్‌కు మద్దతు అని చెప్పలేం. ఇందులో మద్దతు తెలిపేవారు, వ్యతిరేకులు ఉంటారు. కాకపోతే ఇండియాలో ట్రంప్‌తో పోల్చుకుంటే బైడెన్ ప్రభావం చాలా తక్కువగా ఉందని ఇది తేటతెల్లం చేస్తోంది.

వాస్తవానికి ఆసియా అమెరికన్లు బైడెన్‌కు ఓట్లేశారని ఓ అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇందులో ఇండియన్లు ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వదేశంలోని రాజకీయాల తర్వాత ఇండియన్లు ఆసక్తితో పరిశీలించేది అమెరికా రాజకీయాలనే. అయితే ఇండియన్లు ఎటు వైపు మొగ్గారనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ విషయమై స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కానీ, నేటి ట్విట్టర్ ట్రెండింగ్‌లో ట్రంప్ పేరుతో ఉన్న హ్యాష్‌ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది. ఇక ట్రంప్ ప్రత్యర్థి జోయి బిడెన్‌ ఇండియా ట్రెండ్స్‌లో పెద్దగా కనిపించలేదు. మ‌రి కొద్దిగంట‌ల్లోనే అమెరికా అధ్య‌క్షుడు ఎవ‌ర‌న్న దానిపై క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here