వాళ్ల‌కు బ్యాడ్ న్యూస్‌.. మ‌న‌కు గుడ్ న్యూస్‌.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌రోసారి పంజా విసురుతోంది. ప్ర‌పంచంలో ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దీంతో చాలా దేశాలు లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.

భార‌త్‌లో క‌రోనా కేసులు త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం ఇండియాలో కేసుల తీవ్ర‌త త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీ రేటు కూడా పెరిగింది. ఏకంగా 91 శాతం క‌రోనా రిక‌వ‌రీ రేటు భార‌త్‌లో న‌మోదైంది. దీన్ని శుభ‌ప‌రిణామంగా శాస్త్ర‌వేత్త‌లు అభివ‌ర్ణిస్తున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా ప‌రీక్ష‌లు చేయ‌గా.. 48,268 కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొత్తం యాక్టీవ్ కేసులు 5,82,649గా ఉంది. అయితే ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

భార‌త్‌లో మాత్రం క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉంది. ఇత‌ర దేశాల్లో క‌రోనా రెండో సారి విజృంభిస్తుంద‌న్న సంకేతాలు ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం రెండోసారి క‌రోనా వ‌స్తుంద‌న్న భ‌యం ఇప్ప‌ట్లో లేదు. మ‌రో నెల రోజుల్లో కేసుల తీవ్ర‌త పెరుగుతుంద‌ని అంటున్నా ఇప్ప‌టికి మాత్రం త‌గ్గుద‌ల ఉంది. అమెరికాలో క‌రోనా కేసుల తీవ్ర‌త చూస్తే ఆందోళ‌న క‌లుగుతోంది. మొన్న‌ ఒక్కరోజే 90వేలకు పైగా కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. దేశంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 గంటల్లో 90వేలకు పైగా మంది కొవిడ్ బారినపడడం ఇదే మొదటిసారి. అమెరికాతో పాటు చాలా దేశాల్లో కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వారితో పోల్చుకుంటే మ‌నం చాలా సేఫ్ అని అనుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here