డొనాల్డ్ ట్రంప్‌కు ఘోరంగా అవ‌మానం..

అమెరికాలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర అవమానం జ‌రిగింది. జర్మనీలోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ట్రంప్ మైన‌పు విగ్ర‌హాన్ని చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు. మేడమ్ టుస్సాడ్స్‌లో విగ్ర‌హం ఉంటే వారు చాలా గౌర‌వంగా ఫీల్ అవుతారు. అలాంటి ఈ మ్యూజియంలో ఇప్పుడు ట్రంప్ విగ్ర‌హం చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు.

అమెరికా అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో ట్రంప్‌కు పోటీగా జో బైడెన్ ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. అయితే ప‌లు స‌ర్వేల్లో ట్రంప్ వెనుక‌బ‌డ్డారు. ఈ ప‌రిస్థితుల్లో పోలింగ్ స‌మ‌యంలో ట్రంప్ విగ్ర‌హం చెత్త‌బుట్ట‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీనిపై మ్యూజియం మార్కెటింగ్ మేనేజ‌ర్ స్పందించారు. ఈసారి ఎన్నికల్లో ఇలాంటి ఫలితం రావాలనే తాము కోరుకుంటున్నామ‌ని చెప్పారు. దానికి ప్రతీకగా ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పెట్టామ‌ని… అమెరికా ఎన్నికల విషయంలో మా ఆకాంక్ష ఇదే అన్నారు.

ట్రంప్ విగ్ర‌హం ప‌క్క‌నే ట్రంప్‌ను చెత్తలో పడేసి అమెరికాను మళ్లీ గొప్పదేశంగా మారుద్దాం అని కూడా రాశారు. అయితే ఈ మ్యూజియం ట్రంప్ విగ్ర‌హాన్ని వాడుకోవ‌డం ఇదేమీ మొద‌టి సారి కాదు. గ‌తంలో కూడా క‌రోనా విష‌యంలో మాస్క్ పెట్టిన ట్రంప్ విగ్ర‌హాన్ని అక్కడ ఉంచి అంద‌రూ ఇలాగే మాస్క్ ధ‌రించాల‌ని కోరింది. అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ప్ర‌తిష్టాత్మ‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఇప్ప‌టికే స‌ర్వేల్లో వెనుక ఉన్న ట్రంప్ ఆత్మ‌స్థైర్యంలో మాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here