బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ కేసులో సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సీబీఐ ప్ర‌త్యేక కోర్టు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో నిందితులంద‌రినీ నిర్దోషులుగా చెబుతూ సీబీఐ ప్ర‌త్యేక‌ కోర్టు సంచ‌లన తీర్పు వెలువ‌రించింది. అభియోగాల‌పై స‌రైన ఆదారాలు లేవ‌ని నిందితుల‌పై మోపిన అభియోగాలు కోర్టు కొట్టి వేసింది. నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని చెప్ప‌డానికి ఆధారాలు లేమీ లేవ‌ని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో  32 మందిని నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ సీబీఐ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఘ‌టన‌ కుట్ర‌తో జ‌రిగింది కాద‌ని..  ముందుగా ప‌థ‌కం వేసుకొని చేసిన ప‌ని కాద‌ని కోర్టు నిర్ణ‌యం వెలువ‌రించింది. ఈ మేర‌కు జ‌డ్జి సురేంద్ర కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు.

1992లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 49 మంది నిందితులు ఉండ‌గా.. వీరిలో 17 మంది చ‌నిపోయారు. ప్ర‌స్తుతం 32 మంది ఉన్నారు. నిందితులంద‌రిపై సీబీఐ అభియోగాలు మోపింది. కాగా రాజ‌కీయ కార‌ణాల‌తోనే త‌మ‌ను కేసులో ఇరికించార‌ని నిందితులు చెబుతున్నారు. 28 ఏళ్ల త‌ర్వాత ఈ కేసులో ఉన్న నిందితులందా నిర్దోషులని సీబీఐ కోర్టు తెలిపింది. కోర్టు తీర్పుతో బీజేపీ అగ్ర‌నేత ఎల్.కే అద్వానీకి ఊర‌ట ల‌భించిన‌ట్లైంది. కాగా జ‌డ్జి సురేంద్ర యాద‌వ్‌కు పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌తో భ‌ద్ర‌త క‌ల్పించారు. దేశ వ్యాప్తంగా సమ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here