జలకాలాటలలో బిగ్ బాస్ బ్యూటీ.. !

కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది నటి వితికా షేరు. అనంతరం తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ 3 తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ నటి. అంతకుముందు హీరో వరుణ్ సందేశ్ భార్యగానే అందరికీ పరిచయం ఉన్న వితిక.. ఈ రియాలిటీ షో అనంతరం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత పలు రియాల్టీ షోలో పాల్గొంటూ బిజీగా మారింది వితిక.

ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందీ భామ. తన వ్యక్తిగత వివరాలతో పాటు, కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ క్రమంలోనే వితిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓ వాటర్ ఫాల్ దగ్గర పై నుంచి నీళ్లు పడుతుండగా.. ఆ నీటిలో తడుస్తూ ఏ ఆర్ రెహమాన్ ‘గుంజుకున్న’ పాటకు స్టెప్పులేసిన వితిక.. ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోతో పాటు.. ‘ ఇంత పెద్ద సృష్టిలో నేను ఎంత.. నా సమస్యలు ఎంతా అని గుర్తుచేసే ప్రదేశాలంటే నాకెంతో ఇష్టం’ అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ ను జోడించిందీ బ్యూటీ. మరి ఆ ఫోటోలు, వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

https://www.instagram.com/vithikasheru/?hl=en

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here