పిల్ల‌ల‌కు పాలు దొర‌క‌డం లేదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌

గోదావ‌రి వ‌ర‌ద‌లు ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేశాయి. గోదార‌మ్మ ఆగ్ర‌హించడంతో ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. పిల్లా పాపాల‌తో ఇల్లు వాకిలి స‌ర్దుకొని అంతా నిరాశ్ర‌యుల‌య్యారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌ద బాదితుల స‌మ‌స్య‌ల‌పై ఆవేధ‌న వ్య‌క్తం చేశారు.

గోదావ‌రి ముంపు ప్రాంతాల్లో 50 వేల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. 200 లంక గ్రామాలు మునిగిపోయాయ‌ని ఆయ‌న తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల బాధ‌లు ఆవేధ‌న క‌లిగిస్తున్నాయ‌ని అన్నారు. ప‌లు ప్రాంతాల్లో ప‌సి పిల్ల‌ల‌కు పాలు కూడా దొర‌క‌డం లేద‌న్నారు ప‌వ‌న్‌.

పున‌రావాస కేంద్రాల్లో ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేద‌న్నారు. వైద్యులు కూడా అందుబాటులో లేర‌న్నారు. వెంట‌నే స‌రైన వైద్యం అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే ఇంత‌లా ముప్పు ఉండేది కాద‌న్నారు. తొంద‌ర‌గా ప్రాజెక్టు ప‌నులు చేయాల‌ని ఆయ‌న కోరారు.

చిన్న పిల్ల‌లు పాలు దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న ఆయ‌న‌.. అత్య‌వ‌స‌ర వ‌స్తువుల జాబితాలో పాలు కూడా చేర్చాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here