తిరుగులేని రికార్డులు రాస్తున్న బాహుబలి

బాహుబాలి రెండవ భాగం ట్రైలర్ తరవాత ఆ చిత్రం హిందీ నుంచి అన్ని భాషల్లో రికార్డులు తిరగ రాస్తుంది అని అందరూ సాధారణంగా నే ఊహించారు. మలయాళం , తమిళం లలో మొదటి భాగం లో కంటే కొత్త భాగం ఎక్కువ రికార్డులు సృష్టిస్తోంది. పండగ గానీ, శలవు కానీ లేని రోజున కూడా బాహుబలి ప్రభంజనం ఎక్కడా తగ్గడం లేదు. కానీ బాహుబలిపై వున్న క్రేజ్‌ ఒక్క రోజు ముచ్చట కాదని, నిజంగానే అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రం మాయలో పడిపోయారనేది తెలియడానికి బాహుబలి ధాటి మరికొన్నాళ్ల పాటు కొనసాగాలి. 208.82 కోట్ల నెట్‌ వసూళ్లతో సుల్తాన్‌ పేరిట ఈ రికార్డు వుంది.

ఈ నెట్ అమౌంట్ ని వీకెండ్ తో బాహుబలి బ్రేక్ చేస్తుంది అనే అంటున్నారు. ఆదివారం సోమవారం శలవులు కావడం తో అప్పటి దాకా బాహుబలి మరొక నలభై కోట్ల వసూళ్లు లాగాచ్చి.ఆ తర్వాత మూడు రోజుల్లో మరో యాభై కోట్లు వసూలు చేస్తే ఈ రికార్డు బ్రేక్‌ అవుతుంది. అదే జరిగితే బాలీవుడ్‌ మొదటి వారం రికార్డుని బ్రేక్‌ చేసిన డబ్బింగ్‌ చిత్రంగా బాహుబలి కీర్తి కిరీటంలో మరో మణి చేరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here