ఇండియన్ సినిమా ఖ్యాతి ని అద్భుతంగా చాటి చెప్పింది బాహుబలి .. గొప్ప రికార్డ్

ప్రపంచ దేశాల్లో రెండు వందల మిలియన్ డాలర్ల కి పైగా వసూలు సాధించిన దేశాల సినిమాలు లేవు. అమెరికా, చైనా , జపాన్ సినిమాలకి మాత్రమె విదేశాల్లో గ్రాస్ కలక్షన్ లు బాగా వస్తాయి. ఇప్పుడు బాహుబలి దెబ్బతో ఇండియా కి కూడా ఆ ఖ్యాతి లభించింది.బాహుబలి కేవలం ఇండియా లోనే వందల మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రపంచం లో అమెరికా, చైనా, జపాన్‌ తర్వాత బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఇండియా కి ఏర్పడింది అని బాహుబలి 2 నిరూపణ చేసింది. అయితే మన గొప్పతనం ఏంటి అంటే మిగితా దేశాలతో పోల్చుకుంటే వేలాది థియేటర్ లు ఇండియా లో లేవు.

తక్కువ థియేటర్ లతో మనవాళ్ళు ఆ సూపర్ ఫీట్ ని సాధించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం అన్ని భాషల వాళ్ళూ బాహుబలి ని ఓన్ చేసుకోవడం వలనే ఈ ఘనత సాధ్యపడింది అని చెప్పచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here