వెయ్యికి పైగా సెంటర్ లలో బాహుబలి 2 యాభై రోజులు .. కనీ వినీ ఎరుగని రికార్డు :

ఎంత పెద్ద స్టార్ అయినా ఈ రోజుల్లో యాభై రోజుల సినిమాలు చెయ్యలేక పోతున్నారు. ఎన్నేసి రికార్డులు బద్దలు కొట్టినా సరే ఆ సినిమా యాభై రోజుల సెంటర్ లు పూర్తి అవ్వడం గగనమైన విషయమే. అయితే బాహుబలి మాత్రం అన్నిటికంటే భిన్నంగా తన సత్తా చాటింది. మిగితా సినిమాలు ఏవీ తనతో పోటీ పడలేదు అంటూ యాభై రోజుల లెక్కని పూర్తి చేసింది ఈ సినిమా. దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా సెంటర్ లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. మరోవైపు 50 రోజులు గడిచిపోయినా, ఈ సినిమాకు ఇంకా ఆదరణ తగ్గలేదు.

ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 1650 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే ఈ సినిమాను చైనాలో విడుదల చేయనున్నారు. ప్రభాస్ హీరోగా రానా విలన్ గా చేసిన ఈ చిత్రం లో తమన్నా, అనుష్క హీరోయిన్ లుగా కనిపిస్తారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేసిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here