ధోని నుంచి చాలా నేర్చుకున్నా

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఇటీవ‌లె గుడ్‌బై చెప్పిన మ‌హేంద్ర సింగ్ ధోని గురించి క్రికెట‌ర్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఆయ‌న బాహ్య‌ప్ర‌పంచంతో పంచుకున్నారు. టీం ఇండియా కోసం మ‌హీ చాలా చేశార‌న్నారు.

అశ్విన్ మాట్లాడుతూ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికినా ధోనికి శుభాకాంక్ష‌లు తెలిపారు. బ‌య‌ట‌కు ప్ర‌శాంతంగా క‌నిపించే ధోని లోప‌ల భావోధ్వేగాలు చాలా ఉన్నాయ‌న్నారు. మ‌హి టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంద‌ర్బంలో ఎంతో భాద‌ప‌డ్డార‌న్నారు. ఆ రోజు మ్యాచ్‌ను కాపాడేందుకు ధోనితో క‌లిసి తాను చాలా ప్ర‌య‌త్నించిన‌ట్లు ధోని చెప్పారు. అయితే ఓడిపోవ‌డంతో ధోని చాలా ఫీల‌య్యార‌న్నారు.

టెస్టుల‌కు గుడ్‌బై చెప్పిన రోజు ధోని ఏడ్చేశార‌న్నారు. ఆ రోజు ధోని జెర్సీ తీయ‌లేద‌ని చెప్పారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ‌గా క్లోజ్ అయిన వ్య‌క్తుల్లో ధోని ఒక‌డ‌న్నారు. అయితే ధోని నుంచి చాలా నేర్చుకున్న‌ట్లు చెప్పారు. చాలా మ్యాచుల్లో ధోని త‌న‌ను ద‌గ్గ‌రుండి ప్రోత్స‌హించార‌ని అశ్విన్ చెప్పారు. ఇత‌రుల కంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌క‌పోయినా త‌న‌కు ఎలా ఆడాలో ధోని స‌ల‌హాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లేవార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here