పండుగ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వ‌స్తున్నాయా..

పండుగ‌ల సంద‌ర్బంగా ఆఫ‌ర్లు వ‌స్తుంటాయ‌ని ప్ర‌జ‌లు ఎదురుచూస్తుంటారు. అయితే ప్ర‌జ‌ల ఆశ‌ను అవ‌కాశంగా తీసుకొని సైబ‌ర్ దాడులు చేసేందుకు రెడీ అవుతోంది చైనా. భార‌త్‌లో ఈ త‌ర‌హా దాడులు చేసేందుకు చైనా సిద్ద‌మైంద‌న్న వార్తలు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

వాట్సా్‌పలలో ఒక సందేశం చక్కర్లు కొడుతుంటుంది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’ లేదా ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ పేరుతో ఒక లింక్‌ వస్తుంది. అది క్లిక్‌ చేస్తే చక్రం తిరుగుతున్న పేజీ ఒకటి తెరుచుకుంటుంది. ఆ చక్రం ఒప్పో ఎఫ్‌ 17ప్రో వద్ద ఆగుతుంది. దీంతో.. ఆ ఫోన్‌ మీకు ఫ్రీగా పంపిస్తున్నాం అని అందులో ఒక సందేశం కనిపిస్తుంది. కానీ అది చైనా హ్యాకర్ల పని అని తేల్చి చెబుతోంది సైబర్‌ పీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ. లక్షలాదిమంది భారతీయుల వివరాలే లక్ష్యంగా చైనాకు చెందిన హ్యాకర్లు ఈ కుంభకోణానికి తెర లేపారంటూ ఒక నివేదిక విడుదల చేసింది. ‘‘చైనాలోని గువాంగ్‌డాండ్‌, హెనన్‌ ప్రావిన్సుల నుంచి హ్యాకర్లు సైబర్‌ దాడులు కొనసాగించారు.

ఫాండ్‌ షావో కింగ్‌ అనే సంస్థ నుంచి ఈ హ్యాకింగ్‌ జరిగింది. అలీబాబా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వేదికపై తమ డొమైన్లను హ్యాకర్లు నమోదు చేసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఆఫర్లంటూ నకిలీ లింకుల్ని సృష్టించి హ్యాకర్లు నెటిజన్లను ఆకర్షించారు. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’, ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ వంటివన్నీ ఈ హ్యాకింగ్‌ కుంభకోణంలో భాగమే. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని సైబర్‌పీస్‌ నివేదికలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here